మానవ జీవిత లక్ష్యం :జ్ఞానోదయం
₹10.0
నీలో మోక్షం పొందాలి అనే తపన ఉంటే..ఆ తపన నిన్ను జనన మరణ వలయాన్ని ఈ జన్మతో ఎలాగైనా తెంపాలి అని నిరంతరం నిన్ను నిద్రపోనివ్వకపోతే..నువ్వు రోల్స్ రాయల్స్ లో తిరిగినా ,బెంజ్ కారులో తిరిగినా మోక్షాన్ని తప్పక పొందుతావు.నువ్వు ధనం కోసం,పదవి కోసం చివరికి ఒక స్త్రీకోసం ఎంత పిచ్చివాడవై..అవి లేకపోతే..ఉక్కిరి బిక్కిరి అవుతావో..జ్ఞానోదయం కోసం ,జన్మరాహిత్యం కోసం అంతే పిచ్చివాడవవు.. మోక్షం అనేది ఒక మానసిక స్థితి.నీలో ప్రగాఢ కాంక్ష కలిగితే..నీలో రుషి గుణం మొలకెత్తడం ఆరంభమవుతుంది.నువ్వు నీ గదిలో జీన్స్ పాంట్ టీ షర్ట్ వేసుకుని ధ్యానం చేసినా నీకు జ్ఞానోదయం కలుగుతుంది.జ్ఞానోదయం కలిగినంత మాత్రాన..జీవితాన్ని సన్యసించ నక్కర లేదు.రాజ భోగాలు అనుభవించండి కానీ వాటి కంటే గొప్ప ఆధ్యాత్మిక ఆనందం ఉందని తెలుసుకోండి.బంధాలను అల్లుకుని మమేకమై ప్రేమించండి కానీ అవి మీరు స్వర్గానికి వెళ్ళేటప్పుడు అడ్డు పడకుండా చూసుకోండి.ప్రాపంచికతలో బ్రతకండి కానీ మరణాన్ని జయించండి..జ్ఞానోదయం పొంది జన్మ రాహిత్యాన్ని సాధించండి.మనిషిలా కనిపించే మహర్షిలా జీవించండి
by
- Paperback: 42 Pages
- Publisher: Novel Nuggets Publishers (1 November 2020)
- Language:: Telugu
- ISBN-13: 978-9388758635






Reviews
There are no reviews yet.